నేనేమి ట్రంప్ ను కాదు.. ఉద్ధవ్ థాకరే సెన్సేషనల్ కామెంట్స్

posted on: Jul 22, 2020 5:27PM

కరోనా మహారాష్ట్రను మరీ ముఖ్యంగా ముంబయి ని కబళిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కరోనా మహమ్మారిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. "నేను డొనాల్డ్ ట్రంప్ కాదు. నా కళ్ల ముందే నా ప్రజలు ఇబ్బంది పడటాన్ని నేను చూడలేను" అని ఆయన అన్నారు. శివసేన అధికార మీడియా అయిన సామ్నా కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో అయన ఈ వ్యాఖ్యలు చేసారు. ఈ ఇంటర్వ్యూ ఈ వీకెండ్ లో రెండు భాగాలుగా ప్రసారం కానుంది. ఈ ఇంటర్వ్యూ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో ఘోరంగా విఫలమయ్యారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. వైరస్ ను కట్టడి చేయడం కోసం లాక్ డౌన్ వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన ఆసక్తి చూపలేదనే విమర్శలు ఉన్నాయి. ఐతే తాను ట్రంప్ మాదిరిగా విఫలం చెందలేదనే విషయాన్ని ఉద్ధవ్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పటికీ మహారాష్ట్రలో లాక్ డౌన్ అమల్లో ఉందని.. అయితే మెల్లమెల్లగా ఒక్కొక్క రంగానికి క్రమంగా కరోనా నిబంధనల నుంచి సడలింపులు ఇస్తున్నామని అయన తెలిపారు. ఇదే సందర్భంలో ఏ విద్యార్థి కూడా కరోనా బారిన పడకూడదనే ఉద్దేశం తోనే విద్యార్థులకు ఎలాంటి పరీక్షలను నిర్వహించలేదని ఆయన చెప్పారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...