Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హైడ్రాను అభినందించిన హైకోర్టు
posted on: Oct 6, 2025 8:48PM

భూ కబ్జాదారులపై కొరడా ఝళిపిస్తూ చెరువులను రక్షించ డమే కాకుండా వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత కేంద్రాలకు తరలించడం, వరదల్లో చిక్కు కున్న వారిని రక్షించడం ఎన్నెన్నో మంచి పనులు చేస్తున్న హైడ్రాను హైకోర్టు ప్రశంసిం చింది. నగరంలో చెరువుల అభివృద్ధి ని ఓ యజ్ఞంలా చేస్తోందని కితా బిచ్చింది. అందుకు నగరంలో అభివృద్ధి చెందిన చెరువులే సాక్ష్య మని పేర్కొంది. మరీ ముఖ్యంగా బతుకమ్మకుంట అభివృద్ధిని చూస్తే ముచ్చటేస్తోందని న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి ప్రశంసించారు. ఆక్రమణలకు గురై చెత్తకుప్పలా, పిచ్చిమొక్కలతో అటువైపు చూడాలంటేనే భయంగా ఉన్న ప్రాంతాన్ని సైతం చెరువుగా అభివృద్ధి చేసిన తీరు హర్షణీయం అంటూ అభినందించారు.
బతుకమ్మకుంట సర్వాంగ సుందరంగా మారి.. ఆ పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తోంది. బతుకమ్మ కుంట ను అభివృద్ధి చేయడంతో అక్కడ నివసించే ప్రజలు ఆనందం అంతా ఇంతా కాదు... ఆ పరిసర ప్రాంతా లకు వరద ముప్పు తప్పించడమే కాకుండా.. భూగర్భ జలాలను కూడా పెంచింది. గచ్చిబౌలి లోని మల్కం చెరువును చూసినా కూడా ఎంతో ఆహ్లా దంగా కనిపిస్తోంది.నగరంలో ఇలాగే మరో 5 చెరువుల అభివృద్ధి జరుగుతోంది. చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ఎవరివైనా ఇంటి స్థలాలు, భూములు ఉంటే టీడీఆర్ (ట్రాన్సఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్) కింద వారికి సరైన నష్టపరిహారం ఇవ్వాలి.
ప్రభుత్వం ఇందుకోసం సరైన విధానాన్ని తీసుకురావాలని న్యాయమూర్తి జస్టిస్ విజయ్ సేన్‌రెడ్డి సూచించారు. మాధాపూర్‌లోని తమ్మిడికుంట చెరువు పరిధిలోని రెండు ఎకరాలకు సంబంధించిన టీడీఆర్ కేసు విచారణలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ఈరోజు సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీఆర్ విష యంలో ప్రభుత్వం సరైన విధానాన్ని పాటిస్తే.. చెరువుల అభివృద్ధికి ఎటువంటి ఆటంకం ఏర్పడదని అన్నారు. టీడీఆర్ కేసును వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ఎస్ శ్రీధర్ కూడా జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి వ్యాఖ్యలను ఏకీభావించారు. బతుకమ్మ కుంట ప్రస్తావన తీసుకు వచ్చి హైడ్రా పనితీరుకు ఇది నిదర్శనమంటూ న్యాయవాది శ్రీధర్ కితాబు ఇచ్చారు. తమ్మిడికుంటలో భూములు కోల్పోయిన వారికి సరైన టీడీఆర్ అందించాలంటూ న్యాయవాది శ్రీధర్ విజ్ఞప్తి చేశారు. హైడ్రా ఒకవైపు చెరువులను అభివృద్ధి చేస్తూనే ఆపదలో ఉన్న వారిని రక్షిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారని న్యాయమూర్తి జస్టిస్ విజయ్ సేన్‌రెడ్డి అన్నారు.



.webp)


