Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎన్టీఆర్ పేరు ఖాయం..
posted on: Nov 26, 2014 12:50PM

హైదరాబాద్‌లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు దేశీయ టెర్మినల్‌కి తెలుగుతేజం నందమూరి తారక రామారావు పేరు పెట్టడం మీద పలు రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశాన్ని పలు పార్టీలు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంగా రాజ్యసభలో ప్రస్తావించాయి. దీనికి రాజ్యసభలో కేంద్ర మంత్రి జైట్లీ సమాధానమిచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్‌కి ఎన్టీ రామారావు పేరు మాత్రం యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎన్టీ రామారావు అన్నా, రాజీవ్‌గాంధీ అన్నా తమ ప్రభుత్వానికి చాలా గౌరవమని ఆయన చెప్పారు. అంతర్జాతీయ టెర్మినల్‌కి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరు, డొమెస్టిక్ టెర్మినల్‌కి ఎన్టీ రామారావు పేరు కొనసాగుతాయని తెలిపారు. దేశీయ టెర్మినల్‌కి ఎన్టీఆర్ పేరు తాము కొత్తగా పెట్టలేదని, అది ఎప్పటి నుంచో కొనసాగుతోందని అరుణ్ జైట్లీ అన్నారు.






