హైదరాబాద్ కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం
posted on: Feb 23, 2013 4:28PM

హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కూకట్ పల్లి మెట్రో దుకాణం వెనుక ఉన్న అపార్ట్ మెంట్లోని కెమికల్ ల్యాబ్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్ లీక్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. మంటల ధాటికి కారు పేలిపోవడంతో స్థానికులు భయంతో బాంబు అనుకొని పరుగులు తీశారు.
ఈ అగ్ని ప్రమాదంలో ఒక కారు 8 ద్విచక్రవాహనాలు కాలిపోయాయి. మంటలు చెలరేగిన ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలాడంతో పెద్ద శబ్దాలు వచ్చాయి. పేలుళ్ళ ధాటికి అపార్ట్ మెంట్ కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. పక్కనే ఉన్న ఇళ్ళకి కూడా మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది మ౦టలను అదుపుచేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.



.jpg)


