'ఓయో' రూమ్స్ య‌వ్వారాల‌పై.. హైద‌రాబాద్ సీపీ ఆనంద్‌ రియాక్ష‌న్‌..

posted on: Jan 20, 2022 2:15PM

'ఓయో' రూమ్స్‌. ఒక‌ప్ప‌టి లాడ్జిలు.. ఇప్పుడు మోడ్ర‌న్ ఓయో రూమ్స్‌గా మారాయి. చాలామంది యూత్‌కు అదో ఫేవ‌రేట్ ప్లేస్‌. జ‌స్ట్ ఐడీ ప్రూఫ్ ఉంటే చాలు.. ఆన్‌లైన్లో రూమ్ బుక్ చేసుకోవ‌చ్చు. ఎవ‌రైనా ఉండొచ్చు.. ఎవ‌రితోనైనా ఉండొచ్చు.. ఆడా-మ‌గా.. రూమ్‌లో ఇష్టం వ‌చ్చిన‌ట్టు గ‌డ‌పొచ్చు. అందుకే, బాయ్స్ అండ్ గాళ్స్ ఏకాంతంగా గ‌డ‌ప‌డానికి బెస్ట్ లొకేష‌న్‌గా మారుతున్నాయి ఓయో రూమ్స్‌.

ఆమె ఎవ‌రు? అత‌ను ఎవ‌రు? ఆమె నీకు ఏమ‌వుతుంది? మీ ఇద్ద‌రి రిలేష‌న్ షిప్ ఏంటి? ఇలాంటి క్రాస్ ఎగ్జామినేష‌న్ ఏమీ ఉండ‌దు. పోలీసులు అస్స‌లు అడుగుపెట్ట‌రు. ఏమ‌న్నా అంటే.. సుప్రీంకోర్టు రూల్స్. ఆడా-మ‌గ క‌లిసి ఒకే రూమ్‌లో ఉండొచ్చు అంటూ రూల్స్ మాట్లాడుతుంది ఓయో సంస్థ‌. అందుకే, పార్కులు, ఫ్రెండ్స్ రూమ్స్‌, లాడ్జిలు మానేసి.. కాలేజ్ ల‌వ‌ర్స్‌, ఇల్లీగ‌ల్ ఎఫైర్స్ అన్నీ ఇప్పుడు ఓయో రూమ్స్‌కు షిఫ్ట్ అవుతున్నాయి. ఫుల్ సెక్యూరిటీ ఉండ‌టం.. ఎలాంటి ప‌నికి మాలిన ప్ర‌శ్న‌లు అడ‌గ‌క‌పోవ‌డ‌మే.. ఆ ఆద‌ర‌ణ‌కు కార‌ణం. 

ఓయో రూమ్స్‌లో జ‌రుగుతున్న య‌వ్వారాల‌పై ఎప్ప‌టి నుంచో ఆరోప‌ణ‌లు ఉన్నాయి. సుప్రీంకోర్టు రూల్స్ ఉన్నాయి కాబ‌ట్టి.. ఎవ‌రూ వారిని ట‌చ్ చేయ‌లేక‌పోతున్నారు. లాడ్జీల‌పై రైడ్స్ చేస్తారు.. ఓయో రూమ్స్‌ను ఎందుకు త‌నిఖీలు చేయారంటూ పోలీసుల‌పై మ‌హిళా సంఘాలు ఎప్ప‌టినుంచో ఒత్తిడి పెంచుతున్నాయి. తాజాగా, హైద‌రాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఈ ఓయో రూమ్స్ వ్య‌వ‌హారంపై స్పందించారు. ఆయ‌న ఏమ‌న్నారంటే....

ఓయో లాడ్జ్‌ల వ్యాపారాలకు తాము వ్యతిరేకం కాదన్నారు. వాటి నిర్వహణ తీరు బాగోలేదన్నారు. ఎవరికి రూం ఇస్తున్నారో, ఎవరు రూంలలో ఉంటున్నారో సరిగ్గా చెక్ చేయట్లేదన్నారు. ఆన్‌లైన్ బుకింగ్‌లపై నిఘా పెట్టల్సిన అవసరం ఉందన్నారు. ఓయో లాడ్జ్‌లలో సీసీ కెమెరాలు కూడా సరిగ్గా ఉండట్లేదన్నారు. ఓయో రూమ్స్ , లాడ్జ్ యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని హైద‌రాబాద్ సీపీ సీవీ ఆనంద్ సూచించారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...