హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం..రోడ్లపై భారీ వరద
posted on Aug 4, 2025 6:59PM

హైదరాబాదులో మరొకసారి భారీ వర్షం కుమ్మేసింది.. మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్డు మీద వరద నీరు ఏరులై పారాయి. దీంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.. అన్ని ప్రధాన రోడ్లమీదకి వరద నీరు భారీగా చేరడంతో ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.. కొన్ని ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల వరకు వర్షం నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు.. రాత్రి వరకు వర్షం ఇదే మాదిరిగా పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో వర్షం బీభత్సం సృష్టించింది. పలు కాలనీలు లోతట్టు ప్రాంతాలు జలమ యిపోయినాయి.. అమీర్పేటలోని మైత్రివనం అమీర్పేట మెట్రో స్టేషన్ కిందిభాగం పూర్తిగా నాలుగు అడుగుల వరకు వరద నీరు చేరిపోయింది.. దీంతో పాటు సారధి స్టూడియో పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వరద నీరు వచ్చి చేరింది.. నాంపల్లి జూబ్లీహిల్స్ లోని పలు కాలనీలోకి వరద నీరు వచ్చి చేరింది.. మరోవైపు పలు మల్లెపల్లి చౌరస్తాలోని పలు కాలనీలు నీట మునిగి పోయాయి.
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ వన్ లో భారీ చెట్టు కూలిపోవడంతో ట్రాఫిక్ మొత్తం అస్తవ్యస్థంగా మారిపోయింది..అలాగే నాంపల్లి స్టేషన్ రోడ్ లోని కమత్ హోటల్ లోకి వర్షపు నీరు చేరు కుంది.హోటల్ లో లంచ్ చేయడానికి వచ్చిన కస్టమర్లు వరద నీరు చూసి షాక్ అయ్యారు.ఈ భారీ వర్షానికి నాంపల్లి గాంధీభవన్ పక్కన ఉన్న సాయి కృప అపార్ట్మెంట్ లోకి భారీగా వరదనీరు చేరుకుంది.కొన్ని ప్రాంతాల్లో అయితే 10 సెంటీమీటర్ల వర్షం నమోదయింది.. భారీ వర్షం కారణంగా హైదరాబాద్ సెంట్రల్ ప్రాంతం మొత్తం కూడా బీభత్సం అయిపోయింది.