వైజాగ్ తీరానికి కొట్టుకొచ్చిన భారీ పాము 

posted on: Feb 28, 2024 1:49PM

వైజాగ్ తీరానికి మంగళవారం ఓ భారీ పాము కళేబరం కొట్టుకువచ్చింది. నగర పరిధిలోని సాగర్ నగర్ బీచ్ దగ్గర్లో ఈ కళేబరం కనిపించింది. సముద్రంలో అరుదుగా కనిపించే ఈ పామును నలపాముగా వ్యవహరిస్తారని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారుల వలలకు చిక్కిన పామును తిరిగి సముద్రంలో విడిచిపెట్టే క్రమంలో ఇది చనిపోయి ఉంటుందని చెప్పారు. వలలో చిక్కుకోవడంతో భయాందోళనలకు గురై ఈ పాములు చనిపోతాయని వివరించారు. ఈ భారీ పాము కళేబరాన్ని చూసేందుకు చుట్టుపక్కల వారు గుడ్లవాని పాలెం అమ్మవార్ల ఆలయాల తీరానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవికాస్తా వైరల్ గా మారాయి.
 అక్కడే ఉన్న మత్స్యకారులు దానిని గమనించి వెంటనే తమ వలతో పామును పట్టుకున్నారు. ఈ పాము గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. 
 

google-ad-img
    Related Sigment News
    • Loading...