Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నెల్లూరులో భారీ బెట్టింగ్ రాకెట్ గుట్టురట్టు
posted on: Feb 20, 2026 7:20PM

నెల్లూరు జిల్లాలో ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో అమాయక ప్రజలను నమ్మించి దోచుకుంటున్న భారీ ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా ఆగడాలకు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల చెక్ పెట్టారు. 'రాధే ఎక్స్ఛేంజ్ యాప్' ద్వారా క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తూ, అధిక లాభాల ఆశచూపి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను బాలాజీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
వారి వద్ద నుంచి రూ. 34 లక్షల నగదుతో పాటు, బ్యాంకుల్లో ఉన్న కోటి రూపాయలకు పైగా నిధులను (మొత్తం రూ. 1.39 కోట్లు) పోలీసులు సీజ్ చేశారు. వీటితో పాటు 13 స్మార్ట్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన ఎస్పీ , ఇలాంటి మోసపూరిత ఆన్‌లైన్ యాప్‌ల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీస్ అధికారులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.


.webp)
.webp)


