ప్రతి ఇంట్లో ఉండాల్సిన కోవిడ్ మెడికల్ కిట్

మూడు దశల్లో మూడు విధాలుగా నివారణ చర్యలు..
భయం బలహీనుల్ని చేస్తుంది..

కరోనా ఎవరికైనా రావచ్చు.. ఎప్పుడైనా రావచ్చు అన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కోవిడ్ 19ను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ సమాయత్తం కావల్సిందే. ప్రతి కుటుంబం తమ ఇంటిని అత్యవసరమైన పరిస్థితుల్లో ఐసోలేట్ చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకోోవాలి. ప్రాథమిక చికిత్స కోసం వీటిని తప్పనిసరిగా ఇంట్లో ఉంచుకోవాలి.

పారాసెటమాల్
విటమిన్ సి, డి 3 సప్లిమెంట్స్
బి కాంప్లెక్స్ టాబ్లెట్స్
ఆక్సిమీటర్
 
కోవిడ్ మూడు దశలు:
కోవిడ్ 19 మానవ శరీరంలోకి చేరిన తర్వాత మూడు దశల్లో తన ప్రభావం చూపిస్తోంది.  ఒక్కక్కరిలో ఒకవిధమైన లక్షణాలు కనిపించవచ్చు. ఈ లక్షణాలను జాగ్రత్తగా గమనించి నివారణ చర్యలు తీసుకుంటే ఆరోగ్యాన్నికాపాడుకోవచ్చు.

- ముక్కులో
కొందరికీ ముక్కు చేరిన ఈ వైరస్ అక్కడే వుంటుంది. దీనిని నివారించడానికి ఆవిరి పట్టడం ఒక్కటే సరైన మార్గం.

-గొంతులో
గొంతు నొప్పితో బాధపడతారు. ఇలాంటి లక్షణాలు కనిపించినవారు వేడి నీటిలో ఉప్పు వేసుకుని గార్లింగ్ చేస్తే చాలు. 2,3రోజులు వరుసగా ఉదయం, రాత్రి వేడినీటితో గార్లింగ్ చేస్తే వైరస్ ను అరికట్టవచ్చు.

-ఊపిరితిత్తులలో
ముక్కు, గొంతును దాటి ఊపిరితిత్తుల్లోకి చేరితే దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వస్తాయి. ఈ లక్షణాలు కనిపించేవారు
వేడి నీటి గార్లింగ్ చేస్తూ ప్రాణాయామం చేయాలి,విటమిన్ సి, బి కాంప్లెక్స్, ,పారాసెటమాల్ వేసుకోవాలి. ఆక్సిమీటర్ తో శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ గమనించాలి.

ఎలాంటి పరిస్థితుల్లో  ఆసుపత్రికి..
శరీరంలో ఆక్సిజన్ స్థాయిని గమనించాలి. సాధారణ 98-100 ఉండాలి. అయితే 80కన్నా తగ్గితే ఆక్సిజన్ సిలిండర్ అవసరం. ఇంట్లో అందుబాటులో ఉంటే సరి. లేకపోతే  ఆసుపత్రిలో చేరాలి.

బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, బయట నుంచి ఇంటికి రాగానే శుభ్రంగా కాళ్లు చేతులు, ముఖం కడుక్కోవాలి. కరోనా అనగానే భయపడిపోకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నిరకాల వైరస్ ల మాదిరిగానే దీన్ని పరగణిస్తూ అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే కరోనా కన్న ముందు భయం మనల్ని బలహీనుల్ని చేస్తుంది.