Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బరువు తగ్గాలని అనుకునేవారికి గుడ్ న్యూస్.. ఇలా చేస్తే ఎంతో ఈజీగా..
posted on: Jun 14, 2023 9:30AM
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే బరువు తగ్గడం చాలా ముఖ్యం. బరువు పెరిగేకొద్దీ అనేక వ్యాధుల బారిన పడవచ్చు. అధిక బరువు రక్తపోటు నుండి మధుమేహం, ఇంకా కొన్ని రకాల క్యాన్సర్ల వరకు అన్నింటికీ ప్రధాన కారణమవుతుంది. పరిగా ధికా బరువు ఉంటే తమ పనులు తాము చేసుకోవడంలో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే అధిక బరువును వదిలించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఆశించిన ఫలితం పొందేవారు తక్కువే. కానీ బరువు తగ్గడం చాలా సులభం అనే విషయం మీకు తెలుసా??
బరువు తగ్గడం ఈజీ అంటున్నారేంటి పిచ్చా?? అని నిందించాల్సిన పనిలేదు. నిజంగానే బరువు తగ్గడం సులువు. అయితే విషయమంతా బరువు తగ్గడానికి పాటిస్తున్న విధానాలలోనే ఉంది.
చాలామంది బరువు తగ్గడానికి ఫుడ్ స్కిప్ చేయడం నుండి జిమ్‌లో గంటలు గడపడం వరకు ఎన్నో చేస్తారు. కానీ వీటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. అందుకే సరైన పద్ధతులను శ్రద్ధగా పాటించడం చాలా ముఖ్యం. ఇది బరువు పెరగకుండా నిరోధించడమే కాకుండా ఇతర శరీరక ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది.
బరువు తగ్గాలని అనుకునేవారు అసలు బరువు ఎందుకు పెరుగుతున్నాం అనే విషయం గురించి ఆలోచించాలి. రోజువారీ చేసే పనులు ద్వారా ఖర్చయ్యే దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకుంటే, అది బరువు పెరగడానికి కారణమవుతుంది. అంటే మొదట బరువు పెరగకుండా నియంత్రించాలి. ఎప్పుడైతే బరువు పెరగడం ఆగుతుందో అప్పుడు బరువు తగ్గడానికి చేసే ప్రయత్నాలు పనిచేయడం మొదలుపెడతాయి.
రోజు ఏమి తింటున్నారు?? ఎంత పని చేస్తున్నారు?? శారీరక శ్రమ ఎంత ఉంది??. వ్యాయామం వల్ల ఎలాంటి మార్పులు వస్తాయి.. ఇవన్నీ గమనించుకోవడం చాలా ముఖ్యం.
సాధారణంగా బరువు తగ్గాలని అనుకునేవారు ఆహారంలో కేలరీలు తగ్గుతాయి అనే భ్రమతో తిండి తగ్గిస్తుంటారు. దీనివల్ల ప్రయోజనాలు చేకూరకపోగా ఇతర ఆరోగ్య సమస్యలు కారణం అవుతుంది. కాబట్టి బరువు తగ్గాలి అంటే కేలరీలు తక్కువ ఉండి, కడుపు నింపే ఆహారాలు తీసుకోవాలి. దీనీవల్ల శరీరంలో కేలరీలు పేరుకుపోవు, అధికబరువు క్రమంగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇందుకోసం రోజులో తీసుకునే చక్కెర-తీపి పానీయాలు, బేకరీ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ వంటివి తగ్గించుకోవాలి. వీటికి బదులు సలాడ్స్, పండ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి. ఇవి బరువు తగ్గించుకోవడానికి ప్రయోజనకరంగా ఉంటాయి.
వ్యాయామం తప్పనిసరి..
బరువు తగ్గడానికి ఎన్ని పద్ధతులు ఫాలో అయినా వాటికి జతగా వ్యాయామం ఉండాల్సిందే. ఇది బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. కేలరీలు పొదుపుగా తీసుకుంటూ ఒంట్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగించడం వల్ల బరువు చాలా ఈజీగా తగ్గుతారు. ఆహార మార్పుల ద్వారా మాత్రమే బరువు తగ్గడం సాధ్యం కాదు. బరువు తగ్గడానికి అందుబాటులో ఉన్న మరొక గొప్ప మార్గం యోగ. ప్రతిరోజు యోగ చేస్తూ డైట్ ఫాలో అయితే బరువు తగ్గడం చూసి ఎవరికి వారు ఆశ్చర్యపోతారు.
కాబట్టి ఆహారంలో కేలరీలు తగ్గించడం, వ్యాయామం చేస్తూ కొవ్వును కరిగించడం, డైట్ మెనూ ఫాలో అవ్వడం ఇవి పాటిస్తే అద్బుతమే..
◆నిశ్శబ్ద.






