తక్కువ ఖర్చులో ఇంటిని అందంగా మార్చుకోవడం ఎలా?

 

మీ ఇంటి అందాన్ని పెంచడం కోసం మరియు ఆకర్షణీయంగా కనబడేలా చేయడం కోసం ఖరీదైన వస్తువులను అలంకరణ కోసం వాడల్సినవసరం లేదు. మీరు ముందుగా మీ ఇంటికి ఎలాంటి అలంకరణ ఉంటే బాగుంటుందో ప్లాన్ చేసుకోండి. ఏయే వస్తువు ఎక్కడెక్కడ బాగుంటాయో ఒక ప్రణాళికను సిద్దం చేసుకోండి.

బాగా హడావిడి పడి చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాలలో సింపుల్ గా చేసే ఇంటి డెకరేషనే చాలా అద్భుతంగా, ఆకర్షణీయంగా కనబడేలా చేస్తుంది. లైటనింగ్, ఫర్నీచర్, వాల్ డెక్కర్, ఫ్లోర్ డేకరింగ్ మరియు ఇంటీరియర్ డిజైన్స్ ఇలా ప్రతి ఒక్కదాని మీద దృష్టి పెట్టి, తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ ఇల్లు మరింత అట్రాక్షన్ గా తయారు చేసుకోవచ్చు.

బాగా ఖరీదైన వస్తువులను పెట్టి డబ్బులను వృధా చేసే బదులుగా సింపుల్ గా ఉండే తక్కువ ఖర్చు గల వస్తువులతోనే మీ ఇంటిని ఆకర్షనీయంగా తయారు చేసుకోవచ్చు. మరి వాటి కోసం ఇక్కడ కొన్ని సలహాలు ఉన్నాయి. అవేంటో చూద్దామా! 

 

పెయింటింగ్స్:-
మీ ఇంటిని అలంకరించడంలో పెయింటింగ్స్ కన్నా మంచి అలంకరణలు మరొకటి లేదు. మీ ఇంటి కోసం తక్కువ ఖర్చులోనే ఎక్కువ ఆకర్షనీయంగా కనిపించేది తీసుకోవాలి. అదే విధంగా మీ ఇంటికి ఆ రంగు ఎలా ఉంటుందో ఆలోచించాలి.

 

కుషన్స్:-
మీ గదిని మరింత రిచ్ గా మరియు లక్సరీగా కనబడేలా చేయాలనుకుంటే మీ సోఫా లేదా బెడ్ మీదకు కొన్ని కుషన్స్ లేదా డెరేటివ్ పిల్లోస్ ను ఎంపిక చేసుకోవడం మంచిది. ఇంటి అలంకరణలో తక్కువ బడ్జెట్ లో కుషన్లు లేదా పిల్లోలను ఎంపిక చేసుకోవడం అంత కష్టమైన పనేం కాదు. రకరకాల కొత్త కొత్త డిజైన్ లలో దొరికే తక్కువ ఖరీదు వాటిని ఎంపిక చేసుకొని, మీ ఇంటి సోఫా లేదా బెడ్ మీద వాడుకోవడం వల్ల మీ ఇంటికి మరింత అందం వస్తుంది.

 

 

కర్టెన్లు మరియు మ్యాట్స్:-
మీ ఇంట్లోని గదులకు మ్యాచ్ అయ్యే విధంగా కర్టెన్ ల కలర్స్ ను ఎంపిక చేసుకోవాలి. సింపుల్ కలర్ లో ఉండే ఆకర్షనీయమైన కర్టెన్ లను ఎంపిక చేసుకోవడం వల్ల మీ ఇంటికి అందం రెట్టింపవుతుంది. మీ ఇంటి అలంకరణలో తక్షణ మార్పును తీసుకురావడంలో కర్టెన్లు మరియు మ్యాట్స్ ఎంపిక చేసుకోవడం చాలా సులభ పద్దతి.

 

 

ఇండోర్ ప్లాంట్స్:-
అదే విధంగా కొన్ని అందమైన ఇండోర్ మొక్కలను మీ గదిలో ఉంచుకోండి. ఇండోర్ ప్లాంట్స్ ఇల్లు మరింత అందంగా కనబడేలా చేస్తాయి.