చిన్న మార్పులతో మీ ఇల్లు విశాలం

 

తమ ఇంటిని అందంగా చేసుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మరి అలాంటి వారు తమ ఇంటిని ఏ విధంగా అందంగా, విశాలంగా చేసుకోవాలంటే కొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తే సరిపోతుంది. మరి ఆ మార్పులు ఏమిటో చూద్దామా..!

మీ గదిలో ఎక్కువ స్థలాన్ని కేటాయిస్తున్న అనవసరపు వస్తువులను తీసెయ్యండి. ఎప్పటి కప్పుడు గదిని శుభ్రంగా ఉంచాలి. అనవసరపు చెత్తా చెదారం ఇంట్లోంచి బయటికి పంపించాలి. ఇలా చేస్తే మీ గది విశాలంగా కనిపిస్తుంది. అలాగే ఏవైనా మంచి మంచి కర్టెన్స్ లాంటివి ఏర్పాటు చేసుకుంటే గదిని మరింత అందంగా కనబడేలా చేసుకోవచ్చు.

ఖరీదైన ఫర్నిచర్ లాంటివి వాడకుండా తక్కువ బడ్జెట్ లో ఉండి, ఆకర్షనీయంగా కనపడే ఫర్నిచర్ ను వాడటం వల్ల మీ ఇంటికి ఓ కొత్తదనం వస్తుంది. అదే విధంగా ఎక్కువ స్థలాన్ని కేటాయించే ఫర్నిచర్ లాంటివి కాకుండా తక్కువ స్థలాన్ని కేటాయిస్తూ, మీకు ఉపయోగపడే ఫర్నిచర్ ను వాడటం మంచిది.

మీ గదికి ముదురు రంగులు వేయడం వల్ల గది కాస్త చిన్నగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి... ఏదైనా లైట్ కలర్ లో ఉండే రంగులను ఎంపిక చేసుకోవడం మంచిది. అదే విధంగా వెంటిలేషన్ సదుపాయం చక్కగా ఉండేలా చూసుకోవాలి. తేలికపాటి రంగులు గదిని విశాలంగా కనిపించేలా చేస్తాయి.

కంటికి ఒక గది పెద్దగా లేదా చిన్నగా కనిపించడానికి చేసే ఏర్పాట్లు ఎన్నో ఉన్నాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే గది యొక్క అందం రెట్టింపు అవుతుంది. ఆ గదిలో అమర్చే వస్తువుల వల్ల కూడా గది యొక్క రూపం మారుతుంది.