TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నాడు అవమానం.. నేడు సన్మానం!

Published on: Tue May 27, 2025 6:25AM

ఆయన జాగీరులో అడుగు పెట్టాలంటే భయపడాలి... ఆయన అనుమతి లేనిదే చెట్టు ఆకు రాలేదు.. కోడి కూయదు అనే చెందగా మారింది గత ఐదేళ్ల కాలంలో చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసింది చట్టం.. చెప్పింది న్యాయం. ఇదే పెద్దిరెడ్డి జాగీరులో అడుగడుగునా సాగిన అరాచకాలు.  గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్టు చేశారు. ఆ అరెస్టు నేపథ్యంలో అనేక మంది ప్రత్యక్షంగా... పరోక్షంగా చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. చంద్రబాబుకు సంఘీభావంగా శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సామన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు  సైకిల్ యాత్ర చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నారువా గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రామకృష్ణ, రామసూరి, ఆది నారాయణ, సుందరరావు రమేష్ సైకిల్ యాత్ర చేస్తూ పుంగనూరు నియోజకవర్గంలోకి 2023 అక్టోబర్ 22న వచ్చారు. పుంగనూరు సుగాలిమిట్ట వద్దకు చేరుకోగానే పెద్దిరెడ్డి అనుచరులు వారిపై దాష్టీకానికి పాల్పడ్డారు. సైకిల్ యాత్ర చేస్తున్న తెలుగుదేశం కార్యకర్తలు టీ తాగడానికి నిలవడంతో వారిని బూతులతో తిడుతూ టీడీపీ జెండాలను, వేసుకున్న పసుపురంగు షర్టులను తీయించారు.  తీవ్రంగా అవమానించారు.

అదే పుంగనూరు నియోజకవర్గంలోని సుగలిమిట్ట వద్ద..  ఎక్కడైతే పసుపు సైనికులకు అవమానం జరిగిందో అక్కడే వారికి ఇప్పుడు సన్మానం జరిగింది.   పుంగనూరు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి సైకిల్ యాత్ర చేస్తున్న వారి సైకిళ్ల కి పాలాభిషేకం చేశారు. అవమానం ఎదుర్కొన్న ఐదుగురికీ పూలమాలలు వేసి శాలువలతో సత్కరించారు. అవమానం జరిగిన చోటే ఘనంగా సన్మానించి.. సగౌరవంగా మహానాడుకు పంపారు.