Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సూపర్-8 తొలి మ్యాచ్ లలో ఆతిధ్య జట్ల ఓటమి
posted on: Feb 23, 2026 8:27AM
.webp)
టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో భాగంగా జరిగిన తొలి రెండు మ్యాచుల్లో ఆధిత్య దేశాలు శ్రీలంక, భారత్ పరాజయం పాలయ్యాయి. శ్రీలంకపై ఘన విజయం సాధించి ఇంగ్లండ్ సూపర్ 8లో శుభారంభం చేసింది. శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 51 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్త. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక బ్యాటర్లు.. 16.4 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటయ్యారు. ఇంగ్లిష్ బౌలర్ల ధాటికి లంక బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. లీగ్ స్టేజ్ నుంచి అజేయంగా సూపర్ -8కు చేరుకున్న శ్రీలంక జట్టు ఇంగ్గాండ్ స్పిన్నర్ల ధాటికి విలవిలల్లాడిపోయింది. లంక జట్టులో ఏడు వికెట్లను ఇంగ్లాండ్ స్పిన్నర్లే పడగొట్టారు.
ఇక సౌత్ ఆఫ్రికాతో ఆడిన సూపర్ -8 మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు ఏడు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేయగా, ఛేదనలో భారత్ 118 పరుగులకే ఆలౌట్ అయ్యింది. శివమ్ దూబె (42) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత్ జట్టు సైతం గ్రూప్ మ్యాచుల్లో అజేయంగా నిలిచి సూపర్-8 దశకు చేరింది


.webp)
.webp)


