ఐసోలేషన్ అవసరమైన వారు పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలు

టెస్ట్... ట్రేస్... ట్రీట్ మెంట్ ఈ మూడు పద్దతుల ద్వారానే కోవిద్ 19 వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు అన్నది పూర్తిగా స్పష్టమైంది. దేశవ్యాప్తంగా, రాష్ట్రంలోనూ వైద్య పరీక్షల సంఖ్య పెరుగుతుంది. అదే స్థాయిలో పాజిటివ్ వ్యక్తుల సంఖ్య కూడా పెరుగుతోంది. కొద్ది పాటి లక్షణాలతో ఇతర అనారోగ్య సమస్యలు ఏమీ లేని వారు ఐసోలేషన్ లో ఉండాలని వైద్యలు సూచిస్తున్నారు. మరి ఐసోలేషన్ అవసరమైన వారు పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలపై అవగాహన పెంచుకోవడం మంచిది. ఇంట్లోనే ఐసోలేషన్ ద్వారా కోవిద్ 19 వైరస్ నుంచి రక్షణ పొందవచ్చు. 

ఐసోలేషన్ అవసరమైన వారు పాటించాల్సిన నియమాలు..

- విటమిన్ సి -1000, విటమిన్ ఇ (ఇ) సప్లిమెంట్స్ తీసుకోవాలి.
- సూర్యరశ్మిలో 15-20 నిమిషాలు ఉండాలి. బయటకు వెళ్లినా.. ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు తప్పనిసరిగా ముఖానికి మాస్క్ పెట్టు కోవాలి.
- పోషకాలతో కూడిన భోజనం వేడిగా తినాలి.  రోజూ ఒక కోడి గుడ్డు తప్పనిసరిగా తినాలి.
- కనీసం 7-8 గంటలు విశ్రాంతి తీసుకోవాలి.
- వీటన్నింటితో పాటు కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి.
- ఊపిరితిత్తులు పనితీరు పెంచే ప్రాణాయామం చేయాలి. 

ఈ కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఈ కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి కోవిద్ 19వైరస్ ను ఎదుర్కోనే శక్తిని ఇస్తుంది.