పారిస్ ఒలింపిక్స్.. సెమీస్ కు చేరిన భారత్ హాకీ జట్టు

posted on: Aug 5, 2024 7:20AM

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ అద్భుత ప్రదర్శన చేస్తున్నది. ఆదివారం బ్రిటన్ జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్ లో హాకీ ఇండియా విజృంభించింది. అగ్రశ్రేణి జట్టు అన్న బెదురు లేకుండా బ్రిటన్ లో హోరాహోదీ తలపడింది. చివరికి 4-2 తేడాతో విజయం సాధించి సెమీస్ కు దూసుకెళ్లారు. తొలుత నిర్ణీత 60 నిముషాలలో ఇండియా, బ్రిటన్ జట్లు 1-1 స్కోరుతో సమానంగా నిలిచాయి. దీంతో మ్యాచ్ ఫలితాన్ని షూట్ ఔట్ తో నిర్ణయించారు. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన షూట్ ఔట్ లో భారత ఆటగాళ్లు నలుగురు గోల్స్ చేయగా, బ్రిటన్ ఆటగాళ్లు ఇద్దరు మాత్రమే చేయగలిగారు. దీంతో విజయం భారత్ ను వరించింది.  

మ్యాచ్ మొదలైన 17వ నిముషంలోనే భారత స్టార్ డిఫెండర్   అమిత్‌ రోహిదాస్‌కు రిఫరీ రెడ్‌ కార్డ్‌ ఇవ్వటంతో..   భారత్‌ పది మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది.  దీంతో  గ్రేట్‌ బ్రిటన్‌ ఎదురుదాడిలో పస పెంచింది. ఈ సమయంలో భారత్‌ ఎటాకింగ్‌ను వదిలేసి పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. అయినా పట్టుదలతో ఆడి విజయాన్ని దక్కించుకుంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...