Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కర్ణాటక నుంచి హైదరాబాద్ పాకిన హిజాబ్ వివాదం
posted on: Jun 17, 2023 1:42PM
కర్ణాటకలో నిరుడు ప్రారంభమైన హిజాబ్ వివాదం తెలంగాణకు పాకింది. హైదరాబాద్‌లోనూ హిజాబ్ వివాదం తలెత్తింది. ఐఎస్ సదన్ చౌరస్తాలోని కేవీ రంగారెడ్డి మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం డిగ్రీ ఉర్దూ మీడియం సప్లిమెంటరీ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు హాజరైన కొందరు ముస్లిం విద్యార్థినులు తమను హిజాబ్ ధరించి పరీక్ష రాసేందుకు అనుమతించలేదని ఆరోపించారు. హిజాబ్‌తో పరీక్ష కేంద్రంలోకి రావద్దని సిబ్బంది తేల్చి చెప్పినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు, కాలేజీ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగినట్టు కూడా తెలిసింది. చివరకు కొందరు హిజాబ్ తీసేసి పరీక్షకు హాజరైనప్పటికీ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మిగతా వారిని హిజాబ్‌తోనే పరీక్షకు అనుమతించినట్టు సమాచారం. ఈ వివాదం కారణంగా తాము అరగంట ఆలస్యంగా పరీక్ష ప్రారంభించామని విద్యార్థినులు చెప్పారు. తదుపరి పరీక్షకు హిజాబ్ లేకుండా రావాలని కూడా సిబ్బంది ఆదేశించారని అన్నారు. మరోవైపు, ఈ వార్తలను కాలేజీ యాజమాన్యం ఖండించింది. హిజాబ్ ధరించిన వారిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదన్నది వాస్తవం కాదని స్పష్టం చేసింది.
ఈ ఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రులు రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీకి ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ జరిపిస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కాలేజీ నిర్వాహకులతో మాట్లాడతామని కూడా విద్యార్థినుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.
ఫిబ్రవరి 2022 ప్రారంభంలో, మన దేశంలోని కర్నాటక రాష్ట్రంలో తొలిసారి హిజాబ్ ఉల్లంఘన నిబంధన వచ్చింది. పాఠశాల యూనిఫామ్‌లకు సంబంధించిన వివాదం అట్టుడికింది. తరువాతి వారాల్లో, ఈ వివాదం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇతర పాఠశాలలు, కళాశాలలకు వ్యాపించింది, కాషాయ కండువాలు ధరించాలని డిమాండ్ చేస్తూ హిందూ విద్యార్థులు రెచ్చిపోయారు. అనేక విద్యాసంస్థలు హిజాబ్ ధరించిన ముస్లిం బాలికలకు ప్రవేశాన్ని నిరాకరించాయి. కర్ణాటకలో సద్దుమణిగిన ఈ వివాదం మరో పొరుగునే ఉన్న తెలంగాణకు పాకింది.


.webp)
.webp)


