కొడంగల్ లో స్వల్ప ఉద్రిక్తత..స్థానికుల ఆందోళన

posted on: Dec 7, 2018 2:09PM

 

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడి 233 పోలింగ్‌ కేంద్రంలో మూడో నంబర్‌ మీట నొక్కమని పోలింగ్‌ సిబ్బంది మహిళా, వృద్ధ ఓటర్లపై ఒత్తిడి తెస్తున్నారంటూ కాంగ్రెస్‌ నేతలు అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న ఎస్పీ, ఏఎస్పీ, బలగాలు పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఓటింగ్ సజావుగా సాగుతోంది. కొడంగల్ పరిస్థితిపై జిల్లా ఎస్పీ అవినాష్ మహంతి మాట్లాడుతూ.. 3వ నెంబర్ బటన్ నొక్కాలని అక్కడి ఎన్నికల సిబ్బంది వృద్ధ ఓటర్లకు సూచించారని ఆరోపణలు వచ్చిన విషయం తన దృష్టికి వచ్చిందని అన్నారు. దీనిపై ఎవరైనా పిర్యాదు చేస్తే రిటర్నింగ్ అధికారి విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని చెప్పారు. మరోవైపు కొడంగల్‌లో స్థానికులు ఆందోళనకు దిగారు. తమ ఓట్లు గల్లంతయ్యాయని రోడ్డుపై బైఠాయించారు. కుట్రపూరితంగా తమ ఓట్లు తొలగించారని వారు ఆరోపించారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...