లోకేష్ పనితీరు భేష్.. హైకోర్టు ప్రశంసలు

posted on: Feb 25, 2026 9:43AM

ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పనితీరుపై కోర్టులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నాయి. ముఖ్యంగా  ముఖ్యంగా విద్యాశాఖలో ఆయన తీసుకువచ్చిన, తీసుకువస్తున్న సంస్కరణలు, విద్యారంగంలో సమస్యల పరిష్కారం విషయంలో చూపుతున్న చొరవ పట్ల ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం అభినందించింది.   కస్తూర్బా పాఠశాలల సిబ్బంది జీతాలు పెంచుతామంటూ ఆయన చేసిన ప్రకటనను మెచ్చుకుంది.  పెండింగ్‌లో ఉన్న అనేక అంశాలను లోకేష్ బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలంలోనే ఒక కొలిక్కి తీసుకురావడాన్ని హైకోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించి మరీ ప్రశంసించింది.  విద్యాశాఖకు సంబంధించి కోర్టులో పెండింగ్‌లో ఉన్న వి  వివాదాల పరిష్కారానికి లోకేష్ చొరవ తీసుకోవడాన్ని కోర్టు అభినందించింది.  

ప్రజా సమస్యలపై మంత్రి లోకేష్ వేగంగా స్పందిస్తున్నారని.. హాస్టల్ విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటనపై వెంటనే చర్యలు తీసుకున్నారని ప్రశంసించింది. అదే సమయంలో  అధికారుల పనితీరుపై  అసంతృప్తి వ్యక్తం చేసింది.   ప్రజాప్రతినిధి క్షేత్రస్థాయి సమస్యల పట్ల ఎంతటి నిబద్ధతతో ఉండాలో లోకేష్ తీరు నిరూపించిందని హైకోర్టు అభిప్రాయపడింది.

 ఒక మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని సాక్షాత్తూ హైకోర్టు కొనియాడటం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి అరుదైన ప్రశంసను  లోకేష్ హైకోర్టు నుంచి అందుకున్నారు.  కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కొరత, విద్యార్థినుల భద్రతపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సందర్భంగా హైకోర్టు లోకేష్ పనితీరును ప్రత్యేకంగా ప్రశంసించింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...