Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జగన్ దాడి కేసు.. ఏపీ ప్రభుత్వాన్ని వివరణ కోరిన కోర్టు
posted on: Dec 3, 2018 2:28PM

వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసును ఏపీ పోలీసుల పరిధి నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కు బదిలీ చేసేలా ఆదేశించాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. ఆయన తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఎన్‌ఐఏ యాక్ట్ సెక్షన్ 6 ప్రకారం ఎయిర్ పోర్ట్ లేదా, ఎయిర్ క్రాఫ్ట్ లో అఫెన్స్ జరిగితే విచారణ ఎన్‌ఐఏ పరిధిలోకి వస్తుందన్నారు. కానీ ఏపీ ప్రభుత్వం విచారణను తమ పరిధిలో సాగిస్తుందని కోర్టుకు తెలిపారు.వాదనలు విన్న కోర్టు.. ఎయిర్‌పోర్టులో దాడి జరిగితే రాష్ట్ర పోలీసులు ఎందుకు విచారణ చేపట్టారని, కేసు విచారణను ఎన్‌ఐఏకు ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించింది. ఈ కేసును ఎన్‌ఐఏకు ఎందుకు బదిలీ చేయలేదో వివరణ ఇవ్వాలని, పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.






