ఎక్కిళ్ళు

చాలామందికి సడన్ గా ఎక్కిళ్ళు వస్తాయి... కానీ అవి ఎందుకు వస్తాయి...దాని పర్యవసానం ఏమిటి అన్నది చాలామందికి తెలీదు. విదాహకర పదార్ధములు, మలబంధకర పదార్ధములు, చల్లని అన్నము తినుట చల్లని నీటిని తాగటం వలన ప్రాణవాయువు కంఠమందలి ఉదానవాతముతో చేరి హిక్ అను శబ్దముతో ప్రేవుల నుండి బయటకు వస్తుంది. మూత్రపిండాలు చెడిపోయిన కారణంగా వచ్చే ఎక్కిళ్ళను కష్టసాధ్యంగా పరిగణించాలి ఇలా వచ్చిన ప్పుడు తీసుకోవలసిన ముందుజాగ్రత్తలు: స్వేదనము, వమనము, సస్యకర్మ ధూమపానము, విరేచనము, నిద్ర స్నిగ్ధములును, మ్రుదువులుపు, లవణ మిశ్రితములైన పదార్ధములను భుజించుట, పాతవియగు ఉలవలు, గోధుమలు, శాలిధాన్యము పష్టికధాన్యము, పెసలుభుజించుట. వేడినీరు, మాదీఫలము, పొట్లకాయలు, లేతముల్లంగి, వెలగపండు, వెల్లుల్లి తేనె అనునవి హిక్కారోగులకు హితము చేకూర్చును.

 

మందుజాగ్రత్తలు:

నెమలి ఈకల భస్మము, పిప్పలీ చూర్ణములను కలిపి తేనెలో కలిపి సేవిస్తే ప్రబలమైన ఎక్కిళ్ళు శ్వాస భయంకరమైన వమనము శమిస్తాయి. పిప్పళ్ళు, ఉసిరిక వరుగు శొంఠి వీని చూర్ణమందు చక్కెర తేనె కలిపి చాలాసార్లు  సేవిస్తే హిక్కా శ్వాసలు నశిస్తాయి. అతిమధుర చూర్ణమందు తేనె కలిపి తీసుకోవచ్చు. పిప్పలీ చూర్ణమునందు తేనె కలిపి సేవించవచ్చు. వెచ్చని నేతిని గానీ వెచ్చని పాలను గాని రసాన్ని గాని పానం చేస్తే అన్నికరాల ఎక్కిళ్లు నశిస్తాయి...