Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పవన్ పర్యటనను అడ్డుకునే కుట్ర.. పొన్నూరులో హెలిపాడ్ ధ్వసం
posted on: May 4, 2024 9:03AM
యథారాజా తథా ప్రజా అన్నది నానుడి. కానీ వైసీపీ విషయంలో మాత్రం యథా అధినేత, తథా ఆ పార్టీ నాయకులు అని మార్చుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల వేళ వైసీపీ అరాచకాలు రోజు రోజుకూ పెచ్చరిల్లుతున్నాయి. ఓటమి కళ్ల ముందు కనిపిస్తుంటే.. ఆ ఫ్రస్ట్రేషన్ లో ప్రత్యర్థి ప్రచారాన్ని అడ్డుకునేందుకు దౌర్జన్యాలూ, దాడులకు కూడా తెగబడుతున్నారు.
నిన్న కాక మొన్నమచిలీపట్నం వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు ఎన్నికల ప్రచారం పేరుతో ప్రత్యర్థులకు మద్దతు ఇస్తున్న వారిపై దాడులకు తెగబడ్డారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు లక్ష్యంగా ప్రచారం పేరుతో వారి ఇళ్లకు వెళ్లి మరీ దాడులు దౌర్జన్యాలకు తెగబడ్డారు,. నిన్న కాక మొన్న మచిలీపట్నంలో జనసేన నేత కర్రి మహేష్ ఇంటి మీద దాడి చేయించారు. తాజాగా పొన్నూరులో వైసీపీ అభ్యర్థి అంబటి మురళి మరో అడుగు ముందుకు వేసి ఏకంగా జనసేనాని పవన్ కల్యాణ్ పొన్నూరు పర్యటనను అడ్డుకోవడానికి తెగించారు. పవన్ పర్యటన కోసం ఏర్పాటు చేసిన హెలిపాడ్ ను ధ్వంసం చేయించారు.
శనివారం పొన్నూరులో పవన్ కల్యాణ్ పర్యటించనుండగా, ఆయన కోసం ఏర్పాటు చేసిన హెలిపాడ్ ను శుక్రవారం అర్ధరాత్రి అంబటి మురళి ధ్వంసం చేయించారు. రాత్రికి రాత్రి హెలిపాడ్ ను జేసీబీతో తవ్వించేశారు. ఓటమి భయంతోనూ అంబటి మురళి ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. అంబటి మురళీ దోపిడీ దౌర్జన్యాలను ఇటీవలే దూళిపాళ్ల నరేంద్ర బయటపెట్టిన సంగతి తెలిసిందే. ప్రశాంతమైన పొన్నూరులో ఎన్నికల వేళ ప్రజలలో భయాందోళనలను రేకెత్తించే లక్ష్యంతో అంబటి ఇటువంటి విధ్వంసాలకు తెగబడుతున్నారని ఆరోపించారు.
అంబటి మురళి నిర్వాకంపై పొన్నూరు ప్రజలు కూడా మండిపడుతున్నారు. ఇటువంటి దౌర్జన్యాలు, విధ్వంసాలతో తమను బెదిరించలేరని తెగేసి చెబుతున్నారు. హెలిపాడ్ ధ్వంసం సంఘటన ఒక్కటి చాలు అంబటి మురళి పరాజయం ఇప్పటికే ఖాయమైపోయిందనడానికి అని చెబుతున్నారు.






