సముద్రంలో కుప్పకూలిన హెలికాప్టర్
posted on: Feb 24, 2026 2:50PM

దేశంలో మరో హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. అండమాన్ నికోబార్ దీవుల్లో పెను ప్రమాదం తప్పింది. మాయాబందర్ తీరంలో ల్యాండ్ కావాల్సిన పవన్ హాన్స్ హెలికాప్టర్ సాంకేతిక లోపంతో రన్‌వేకు కేవలం 300 మీటర్ల దూరంలో సముద్రంలో కుప్పకూలింది. పైలట్ అప్రమత్తతతో నీటిపై క్రాష్ ల్యాండింగ్ చేయడంతో ఇద్దరు సిబ్బంది సహా మొత్తం ఏడుగురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
ఈ ప్రమాదంపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని పవన్ హన్స్ ప్రతినిధి స్పష్టం చేశారు. పోర్ట్ బ్లెయిర్ లోని శ్రీ విజయపురం ఎయిర్ పోర్ట్ నుండి మాయాబుందర్ కు టేకాఫ్ అయిదీ హెలికాప్టర్‌లో ఆ కొద్దిసేపటికే ఇందులో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో పైలెట్లు సముద్ర జలాల మీద క్రాష్ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి సహా అందరు ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు.




.webp)


