Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రీలీజ్ కు ముందే పూరీ సక్సెస్
posted on: Jan 27, 2014 9:15AM

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్, ఆదాశర్మ జంటగా నటించిన "హార్ట్ ఎటాక్" చిత్రం విడుదలకు ముందే రికార్డు సృష్టిస్తుంది. దాదాపు 23కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్ర బిజినెస్ అప్పుడే 20కోట్లు రాబట్టినట్లుగా తెలిసింది. ఈ చిత్రం హక్కుల్ని నైజాంకి 6 కోట్లకి, సీడెడ్‌కి 2 కోట్లకి, ఆంధ్రాకి 8 కోట్లకు అమ్మారని, అదే విధంగా శాటిలైట్ హక్కులు 4 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. మొత్తంగా చూసుకుంటే ఈ చిత్రానికి పెట్టిన బడ్జెట్ దాదాపు వచ్చేసినట్లే అని చెప్పుకోవచ్చు. పూరీ టూరింగ్ టాకీస్ బ్యానర్లో పూరి స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించాడు. కాబట్టి నిర్మాతగా విజయం సాధించినట్లే. కానీ సినిమా విడుదలై ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ సినిమా జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.






