కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

posted on: Aug 5, 2024 2:12PM

ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టై తీహార్ జైలులో ఉన్న తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిలు పిటిషన్ వై విచారణ వాయిదా పడింది. ఇప్పటికే  కవిత దాఖలు చేసుకున్న పలు బెయిలు పిటిషన్లను కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ఆమె డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఆ పిటిషన్ సోమవారం (ఆగస్టు 5) ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణకు వచ్చింది. అయితే సీనియర్ అడ్వకేట్ అందుబాటులో లేకపోవడంతో పిటిషన్ విచారణ వాయిదా వేయాల్సిందిగా కవిత తరఫు న్యాయవాది కోర్టును కోరారు.

దీంతో కోర్టు కవిత బెయిలు పిటిషన్ ను బుధవారం (ఆగస్టు 7)కు వాయిదా వేసింది. ఇలా ఉండగా కవిత బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ కీలక నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ఢిల్లీ వెళ్లారు. మరో రెండు రోజుల పాటు వారు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ములాఖత్ ద్వారా వారు కవితతో భేటీ అవుతారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...