ఎండాకాలంలో రాగి జావ ఎందుకంటే?

రాగి జావ ఎండాకాలంలో తప్పకుండా తీసుకునే ఆహారంలో ఒకటి. రాగి పిండిని ఒక్కోప్రాంతంలో ఒక్కో పద్దతిలో వినియోగిస్తారు. ఒక్కోపేరుతో పిలుస్తారు 
 రాగి సంకటి అంటే రాగి జావ, చిత్తూరు కడప లాంటిజిల్లాలలో రాగి ముద్ద అని అంటారు. రాగి చపాతి, లేదా రాగి అట్టు, రాగులతో మురుకులు  ఇలా రకరకాల వంటకాలు రాగి పిండి తో చేస్తారు. రాగి మాల్ట్ అంటే అందరికీ తెల్సు ఇప్పటి తరానికి ఇది ఎలా తయారు చేసుకోవాలో తెలియదు .సాంప్రదాయబద్ధంగా రాగి ని చిన్న పిల్లలుగా అంటే పూర్తిగా బాల్యావస్థలో ఉన్నప్పుడు రాగి జావను  తినిపిస్తారు.ఎందుకంటే అది చాలా  సులభంగా అరిగి పోతుంది రాగి మాల్ట్ పిల్లలకు ఒక ఫ్రెండ్లీ రేసిపీగా పేర్కొంటారు. రాగి మాల్ట్ శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. అంతేకాదు  నోటిలో పుళ్ళు వచ్చినప్పుడు ,అజీర్ణం చేసినప్పుడు, కాన్సి పెషన్ తో బాధ పడేవారు రాగి అత్యంత శక్తి దాయక మైన ఆహారమని చెప్పవచ్చు.  రాగి   మాల్ట్ అద్భుతమైన ఐరన్, కాల్షియం, జింక్ తదితరా  తో పాటు ముఖ్యంగా ఫింగర్ మిల్లెట్ లో ఎమినో యాసిడ్లు ఇసొల్లెఉ  సిన్ లేఉసిన్ ,మెథిఒ నైన్ , మరియు ఫేన్యలలనినే,అంటే ఒక గంజిలాంటి ద్రావకం  ఇప్పుడు లభ్యం కావడం లేదు.అదే దీనినుంచి మనకు ఎక్కువ మోతాదులో మనకు లభ్యమయ్యే కాల్షియం,పొటాషియం మనకు లభిస్తుంది దీనినుంచి మనకు పెద్ద మొత్తంలో ఐరన్ లభిస్తుంది. దీనినుంచి వచ్చే ఐరన్ వ్యక్తులకు లాభాన్ని తక్కువ శాతంలో హిమగ్లోబిన్ లెవెల్స్ లభిస్తాయి. రాగి వల్ల పోలిఫేనోల్ అండ్ డై టేరీ పీచుపదార్ధం మైక్రో నుట్రియాంట్స్ వల్ల సులభంగా అరిగిపోతుంది.
   
రాగి మాల్ట్ ఎలా తాయారు చెయ్యాలి...

రాగులను 12 ఘంటలు మొలకేత్తేవిధంగా నానపెట్టుకొని ఉంచండి. మొలకెత్తిన రాగులను పలుచని బట్ట పైన ఒక రోజంతా నానపెట్టండి.మొలకెత్తిన రాగులను నీడలో ఎండబెట్టండి లేదా అలా ఎండబెట్టిన రాగులను వేయించండి. దానిని మెత్తగా పిండి పట్టించండి.

రాగి మాల్ట్కు కావాల్సిన పదార్ధాలు..

మూడు కప్పుల రాగిపిండి.
మూడుకపుల నీళ్ళు .
ఒక కప్పు మజ్జిగ .
ఉప్పు తగినంత . 

రాగి మాల్ట్ తయారీ పద్ధతి...

ఒక కప్పులో మూడు చంచాల రాగి పిండిని ఒక కప్పు నీటిలో బాగా కలపండి. రెండుకప్పుల బాగా మరిగించిన నీళ్ళలో రాగిపిండి కలిపిన నీటిని బాగా మరిగించండి గంజిల చిక్కబడేవరకు  కలుపుతూ ఉండండి. ఆతరువాత బాగా ఆరబెట్టి అందులో మజ్జిగ ఉప్పు కలిపి తీసుకోండి కాస్త రుచికి  ఇలాచి జీడిపప్పు వేసుకుంటే రుచికి రుచి బలానికి బలం అందులో కాస్త డెకరేషన్ కి బాదాం జీడిపప్పు వేసుకుంటే అదుర్స్.