కషాయాలు ఎందుకు.. మిరియాలు.. లవంగాల్లో ఏముంది

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితులలో ఎన్నో ఇంటి చిట్కాలు చక్కర్లు కొడుతున్నాయి. దేశ ప్రధాని సైతం కషాయాలతో కరోనాను తరిమి కొట్టవచ్చని చెప్పారు. పక్కింటివారు చెప్పినా.. ప్రధాని చెప్పినా వాటిలో మనకు కామన్ గా కనిపించేవి మిరియాలు, అల్లం, వెల్లుల్లి, పసుపు, దాల్చిన చెక్క, శొంఠి, లవంగాలు. వీటి కాంబినేషన్ తో తయారు చేసే కొన్ని రకాల కషాయాలు కరోనా మన దరికి రాకుండా తరిమికొడతాయి అని చెప్తున్నారు. మరి ఇంతకీ వీటిలో ఏముంది?
వీటిని ఎందుకు ఔషధాలుగా మనం చెప్పవచ్చు.

అది తెలుసుకోవాలంటే మనం మన సాంప్రదాయ ఆహార పద్ధతులలో ఉన్న ఔషధ గుణాలను తెలుసుకోవాల్సిందే...
క్రీస్తు పూర్వం  2000 కన్నా ముందు బంగారం కన్న గొప్ప విలువ సంపదగా సుగంధ ద్రవ్యాలను భావించేవారు.  దాల్చిన చెక్క, నల్ల మిరియాల తదితర దినుసుల  వాణిజ్యం ద్వారా ఆయా దేశాలు ఆర్థికాభివృద్ధి సాధించేవి. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే సుగంధద్రవ్యాల్లో 70శాతం మన దేశంలోనే పండుతాయి. వీటిని పండించే రాష్ట్రాల్లో కేరళదే అగ్రస్థానం. 
క్వీన్ ఆఫ్ స్పైసెస్‌గా పిలవబడే నల్ల మిరియాలను మన దేశంలో ఒకప్పుడు ఎక్కువగా పండించేవారు. ఆహారంలో రుచిని పెంచడానికే కాదు ఔషధంగా కూడా దీన్ని ఉపయోగిస్తారు. ప్రస్తుతం మిరియాలను వాడుతున్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది.

సుగంధ ద్రవ్యాలు మనకు ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి.. అందుకు కారణం వాటిలో ఉండే  ఆక్సిజన్ రాడికల్ అబ్సర్వేషన్ కెపాసిటీ. దీన్నే మనం ఓఆర్ఏసి గా పేర్కొంటారు జింజర్, తులసి, పసుపు మొదలైనవాటిలో ఓఆర్ఏసి 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. వీటిని తక్కువ మోతాదులో తీసుకోవడం వలన మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  విటమిన్ సి, ఒమేగా త్రీ, విటమిన్ డి వంటి సూక్ష్మ పోషకాలను మనం తీసుకున్న ఆహారం నుంచి  శరీరం గ్రహించడానికి కూడా ఇవి దోహదం చేస్తాయి.