పోషకాలు ఉండాలంటే ఈ పాత్రలోనే వండాలి

మనం తీసుకునే ఆహారం గురించి శ్రద్ద తీసుకుంటున్నాం. కానీ, ఏ పాత్రలో వండితే ఆహారపదార్థాల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయో అన్న విషయం మాత్రం ఆలోచించడం లేదు. వంట త్వరగా కావాలన్న ఆలోచనతో ప్రెషర్ కుక్కర్లను, ఎలక్రికల్ రైస్ కుక్కర్లను, ఇండక్షన్, ఓవెన్ లను ఉపయోగిస్తున్నాం. వీటిలో తయారుచేసే ఆహారపదార్థాల్లో పోషకాలు ఉంటాయా మన శరీరానికి కావల్సిన మోతాదులో అందుతాయా అంటే లేదనే చెప్పాలి.

ఏ ఆహారమైనా వండేటప్పుడు గాలి, వెలుతురు తగలాలి అని మన పెద్దలు చెప్పారు. సూర్య రశ్మి, గాలి తగలని పదార్థాలు పాయిజగా మారుతాయి. అయితే ఈ పాయిజన్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి తక్షణమే పని చేస్తుంది. దానినే ఫుడ్ పాయిజన్ అంటాము. రెండవ రకమైన పాయిజన్ మెల్లగా ప్రభావం చూపిస్తుంది. అది కొన్ని నెలలు కావచ్చు.. సంవత్సరాలు కావచ్చు.

ప్రతి రోజు ప్రతి ఇంట్లో వాడే ప్రెషర్ కుక్కర్ ను గమనిస్తే  ఇందులో ఆహారం వండేటప్పుడు ఏ మాత్రము గాలి, సూర్య రశ్మి తగిలే అవకాశమే లేదు. ప్రెషర్ తో అతి త్వరగా ఇందులోని పదార్థాలు ఉడుకుతాయి. ఎక్కువగా అల్యూమినియంతో తయారుచేసిన కుక్కర్లను ఉపయోగిస్తున్నారు. ఇది మరింత ప్రమాదం అంటున్నారు శాస్త్రవేత్తలు. జ్ఞాపకశక్తిని తగ్గించి క్రమంగా మనిషిని నిర్వీర్యం చేసే గుణం అల్యూమినియంలో ఉంది. ప్రెషర్ కుక్కర్ తయారుచేసిన లోహం, ఇందులో వండే విధానం రెండు ఆహారపదార్థాల్లోని పోషకాలను హరించి దీర్ఘకాలంలో శరీరానికి హాని చేస్తాయి. ప్రెషర్ కుక్కర్ లో వండిన ఆహారం తీసుకునేవారిలో ఎక్కువగా అసిడిటీ సమస్యలు కనిపిస్తాయి.  మధుమేహం, కీళ్ళవాతం మొదలైన సమస్యలు కూడా వస్తాయి. రిఫ్రిజిరేటర్, మైక్రో వేవ్ ఓవెన్ వంటి గాలి,వెలుతురు ప్రవేశించని చోట ఉంచిన ఆహారపదార్థాలు ఏవైనా ప్రమాదకరమే. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్ స్టి ట్యూట్(CTRI) వారి నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

మట్టి కుండే బెటర్
ఆధునిక వంటగదిలో అందుబాటులోకి వచ్చిన పాత్రల కన్నా మట్టి కుండే బెటర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కారణం ఇందులో వండే ఆహారపదార్థల్లో పోషకవిలువలు నూటికి నూరు శాతం ఉంటాయట. మట్టి పాత్రల తర్వాతి స్థానం కంచు పాత్రలది. ఇందులో వండే పదార్థాల్లో పోషకాలు 97శాతం ఉంటాయట. ఇత్తడి పాత్రలో 93 శాతం పోషకాలు అందుతాయట. మరి అల్యూమినియం ప్రెషర్ కుక్కర్ లో వండితే మాత్రం పది నుంచి 15శాతం మాత్రమే పోషకాలు ఉంటాయట.