TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హర్యానాలో పోలింగ్ జరుగుతోంది!

Published on: Sat Oct 5, 2024 12:46PM

హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీకి ఒకే విడతలో పోలింగ్ జరగనుంది.  ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ, మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా, కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్, జేజేపీకి చెందిన దుష్యంత్ చౌతాలాతో పాటు మొత్తం 1027 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.  బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), ఇండియన్ నేషనల్ లోక్ దళ్, బహుజన్ సమాజ్ పార్టీ  కూటమి , జననాయక్ జనతా పార్టీ , ఆజాద్ సమాజ్ పార్టీ (ASP) కూటములు పోటీలో ఉన్నాయి. ప్రధాన పోటీ మాత్రం బీజేపీ, కాంగ్రెస్ ల మద్యే జరుగుతోంది.   ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల  8న వెల్లడికానున్నాయి.