ఎంపీ హర్షకుమార్ అవిశ్వాసం నోటిసు

 

 

 

పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదించేందుకు సిద్దమవుతున్నయూపీఏ ప్రభుత్వం అనకాపల్లి ఎంపీ హర్షకుమార్ అవిశ్వాసం తీర్మానం నోటిసు ఇచ్చారు. ఈ రోజు లోక్ సభలో మధ్యాహ్నం తెలంగాణ బిల్లుపై చర్చ జరగనున్న నేపథ్యంలో ఆయన అవిశ్వాసం తీర్మానం ఇచ్చారు. అదే విధంగా సభ నుంచి సస్పెండ్ అయిన సీమాంధ్ర ఎంపీలను సభలోకి అనుమతించాలని మరో నోటిసు కుడా ఇచ్చారు. సభలో నిరసనలు కొనసాగించాలని ఈ సీమాంధ్ర ఎంపీలు నిర్ణయించుకోవడంతో లోక్ సభ ప్రారంభమైన వెంటనే 12గంటల వరకువాయిదా పడింది. తెలంగాణ బిల్లుపై లోక్‌సభలో ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ తమ పార్టీ ఎంపీలకు మంగళవారం ఉదయం విప్ జారీ చేసింది.