రేవంత్ తో హరీష్ కుమ్మక్కు.. కల్వకుంట్ల సంచలన వ్యాఖ్యలు

posted on: Feb 11, 2026 12:17PM

 

తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత హరీష్ రావు టార్గెట్ గా మారోసారి సంచలన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.  రేవంత్ రెడ్డితో హరీష్ రావు కుమ్మక్కయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా హరీష్ రావు ప్రయోజనాలకు భంగం కలగవన్న కల్వకుంట్ల కవిత.. తాజాగా సిద్దిపేట మునిసిపాలిటీకి మంజూరైన నిధులపై నిలదీవారు. విలేకరులతో మాట్లాడిన కవిత.. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనైనా, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోనైనా సిద్దిపేట నియోజకవర్గానికే నిధులు, అభివృద్ధి పనుల్లో అగ్రతాంబూలం దక్కుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థల కోసం మున్సిపాలిటీల నుంచి ప్రతిపాదనలు వస్తే కేవలం సిద్దిపేటకు మాత్రమే నిధులు మంజూరు కావడం ఏమిటని ప్రశ్రించారు.

గతంలో బీఆర్ఎస్ హయాంలో నిధులన్నీ అటు తరలించడం వల్ల అక్కడ అభివృద్ధి వేగంగా సాగిందని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో పయనించడం వెనుక ఉన్న మర్మమేంటని ఆమె ప్రశ్నించారు. ఒకవైపు రాష్ట్రంలోని ఇతర జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతుంటే, సిద్దిపేటకు మాత్రమే  ప్రాధాన్యత ఇవ్వడమే  హరీష్ రావు..రేవంత్ రెడ్డితో కుమ్మక్క య్యారడానికి సాక్ష్యమని కవిత అన్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...