Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సభలో తెలుగులో ప్రసంగించిన హరికృష్ణ
posted on: Aug 12, 2013 8:41PM

తెలంగాణ అంశంపై రాజ్యసభలో చర్చకు అనుమతించడంతో వివిధ పార్టీల నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ సభ్యుడు ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ రాజ్యసభలో తెలుగులో ప్రసంగించారు. అయితే ఉపసభాపతి అందుకు అడ్డుచెప్పటంతో సభలో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.
సభలో హరికృష్ణ ప్రసంగానికిఅడ్డు చెప్పిన ఉపసభాపది మీరు తెలుగులో మాట్లాడాలనుకుంటే మీరు ముందుగా చెప్పాలని ఆయన సూచించారు. సభ ఉపాధ్యక్షుడు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు, నాకు అర్థం కావాలి కదా అంటూ పలుమార్లు ప్రసంగానికి అడ్డుతగిలారు. దీంతో ఇది మా దౌర్భాగ్యం అని హరికృష్ణ కోపంగా అన్నారు.
తెలుగు నేలకు చెందిన మేము తెలుగులో మాట్లాడకూడదా? నేను తెలుగులోనే మాట్లాడతాను. మీకు తెలుగులో అర్థం కాకపోతే ట్రాన్స్‌లేటర్‌ను పెట్టుకోండి అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు హరికృష్ణ. తాంబూలాలు ఇచ్చేశాం, తన్నుకు చావండి అన్నట్టు తెలంగాణాపై నిర్ణయం చేసేశారు. కాంగ్రెస్ ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందన్న ఆయన ఒక కంట్లో కన్నీరు, మరో కంట్లో పన్నీరా, ఒక కంట్లో కారం, మరో కంట్లో కాటుక పెతడారా? అని ఆయన విమర్శించారు.






