ఆ విద్యాలయం సెక్స్‌, డ్రగ్స్‌కి నిలయం- బీజేపీ ఎమ్మెల్యే సంచలనం

 

ఒకపక్క జేఎన్‌యూలో జరిగిన వివాదాన్ని ఎలా చల్లార్చాలా అని కేంద్ర ప్రభుత్వం తలలు పట్టుకుంటుంటే, వారి మీద మరో మొట్టికాయ వేశాడు ఓ సొంత పార్టీ ఎమ్మెల్యే. జేఎన్‌యూలో రోజూ తాగి తందనాలాడుతూ ఉంటారనీ, రాత్రి ఎనిమిది గంటలు దాటితే మాదకద్రవ్యాల మత్తులో మునిగిపోయి ఉంటారనీ బాంబు పేల్చాడు. జేఎన్‌యూలో రోజూ దొరికే చెత్తని చూస్తే తన మాటలు ఎంతవరకు నిజమో మీకే అర్థమవుతుందంటూ కొన్ని గణాంకాలను కూడా ఇచ్చారు. రాజస్తాన్‌లోని రామఘర్‌ నియోజకవర్గానికి చెందిన జ్ఞాన్‌దేవ్‌ అహూజా అనే సదరు ఎమ్మెల్యే ప్రకారం ఆ గణాంకాల ఏమిటంటే...

 

- జేఎన్‌యూలో రోజూ కాల్పిపారేసిన సిగిరెట్లు 10,000, కాల్చిపారేసిన బీడీ ముక్కలు 4,000 దొరుకుతాయి.

 

- 2000 ఖాళీ చిప్స్‌ ప్యాకెట్లు రోజూ గాలికి దొర్లుతుంటాయి.

 

- 3,000 వాడిపారేసిన కండోమ్స్‌, 500 విసిరిపారేసిన గర్భనిరోధక ఇంజక్షన్లు రోజూ ఇక్కడ చెత్తలోకి చేరుకుంటాయి.

 

- ఇక్కడ చదివేది పిల్లలు కాదు కదా, ఇద్దరేసి పిలల్లు ఉన్న తండ్రులు కూడా ఉన్నారు.

 

- ఇక్కడ 50,000 ఎముక ముక్కలు దొరికాయి!

 

ఇంతకీ సదరు జ్ఞాన్‌దేవ్‌గారికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియలేదు కానీ, టీవీల ముందరే ఆయన ఈ చిట్టాని నిర్భయంగా చదివిపారేశాడు. గణాంకాలు చూస్తేనేమో మరీ నమ్మబుద్ధి కావడం లేదు. మరీ 50,000 ఎముక ముక్కలా!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu