Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కాంగ్రెస్‌లా టీడీపీ కూడా అవినీతిలో కూరుకుపోయింది
posted on: Aug 9, 2018 4:50PM

జీవీఎల్ నరసింహారావు.. ఈమధ్య ఈపేరు బాగా వినిపిస్తుంది.. టీడీపీ మీద ఆరోపణలు, విమర్శలు చేయడమే టార్గెట్ గా ఆయన పెట్టుకున్నట్టున్నారు.. అందుకే టీడీపీ మీద తెగ విమర్శలు చేస్తున్నారు.. అసలు ఆయన విమర్శలు చూసి జీవీఎల్ అంటే గ్రేట్ విమర్శల లీడర్ అని ఛలోక్తులు కూడా వినిపిస్తున్నాయి.. ఆ మాటని నిజం చేస్తూ జీవీఎల్ మరొకసారి టీడీపీ మీద విమర్శలు చేసారు.. రీసెంట్ గా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగడం.. ఈ ఎన్నికలో టీడీపీ మద్దతిచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రసాద్ ఓడిపోయిన సంగతి తెలిసిందే.. అయితే ఈ విషయంపై మాట్లాడిన జీవీఎల్.. కాంగ్రెస్‌తో కలిసిన టీడీపీకి ఇది ఘోర పరాజయం అన్నారు.. కాంగ్రెస్‌లా టీడీపీ కూడా అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు.. స్కాములపై టీడీపీ సమాధానం చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.. త్వరలో టీడీపీని ప్రజల ముందు దోషిగా నిలబెడతామన్నారు.. కాంగ్రెస్ చెంతన చేరిన టీడీపీకి ప్రజలే బుద్ధి చెబుతారని జీవీఎల్ అన్నారు.






