TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గల్లా జయదేవ్ కు తృటిలో తప్పిన ప్రమాదం..

Published on: Fri Apr 29, 2016 2:38PM

 

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కు తృటిలో ప్రమాదం తప్పింది. కృష్ణాజిల్లాలోని గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి గుంటూరు వెళుతున్న ఆయనకు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. గుంటూరులో ఐటీసీసంస్థ రూ. 150 కోట్లతో 'మై ఫార్చూన్‌' పైవ్ స్టార్ హోటల్‌ను నిర్మించనుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీనికి శంకుస్థాపన చేశారు. దీంతో స్థానికి ఎంపీగా గల్లా జయదేవ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉంది. ఈ క్రమంలోనే గన్నవరం విమానాశ్రయం చేరుకున్న గల్లా జయదేవ్ అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా గుంటూరుకు బయల్దేరారు. రోడ్డు పై అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోయి వాహనం పక్కనే ఉన్న ఓ మట్టి గుట్టను ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో గల్లాకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఎంపీని హుటాహుటిన విజయవాడకు తరలించి అనుచరులు ఆయనకు ప్రథమ చికిత్స చేయించారు.

 

ఇటీవలే గుంటూరులో ఓ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి వెళ్లిన సందర్భంలో కూడా ఆయన కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు.