గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం...

 

గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం బీమినేనివారిపాలెంలో ఈరోజు తెల్లవారుజామున...ఓ బొలెరో వాహనంలో పెళ్లికి వెళ్లి వస్తుండగా.. ప్రమాదానికి గురైంది. మేడికొండూరు సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీ, బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరొకరిని గుంటూరుకు తరలిస్తుండగా మృతి చెందాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. గుంటూరు డీఎస్పీ శ్రీనివాసరావు, మేడికొండూరు సీఐ బాలాజీ, ఎస్‌ఐలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతదేహాలను గుంటూరు వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu