మాచర్లలో కన్నా, రాయపాటి పోటాపోటీ

posted on: Mar 12, 2012 2:00PM

గుంటూరు: గుంటూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఎంపి రాయపాటి సాంబశివరావుల మధ్య ఉన్న విభేదాలు అందరికీ తెలిసిందే. పోటీపడే విషయంలో వీరిద్దరూ ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోరు. ఇప్పుడు వీరి పోటా పోటీకి మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం వేదిక అయింది. ఈ నియోజకవర్గంలో తన సన్నిహితుడు గండ్రకోట రాంబాబుకు టిక్కెట్ ఇప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దీంతో వీరిద్దరి మధ్యా మరోసారి పోటీ ప్రారంభమైంది. ఇద్దరు నాయకులు కాంగ్రెస్ టిక్కెట్ ను వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకుని ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేస్తున్నారు.

 

ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేయడానికి మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి లక్ష్మారెడ్డి, కర్రి పున్నారావులు కూడా ప్రయత్నిస్తున్నారు. కన్నా, రాయపాటి ఎవరికీ వారు ఒకవైపు తమ ప్రయత్నాలు చేసుకుంటుండగా ఈ ప్రాంతానికి చెందిన మంత్రులు కాసు కృష్ణారెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్ ఇప్పటివరకు మాచర్ల విషయంపై తమ మనోగతాన్ని అధిష్టానికి వెల్లడించకపోవడం విశేషం.

google-ad-img
    Related Sigment News
    • Loading...