Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తోపుడుబండి వ్యాపారి.. గన్‌మెన్‌ల పహారా!
posted on: Jul 20, 2022 4:48PM
మొన్నామధ్య అదేదో సినిమాలో బ్రహ్మానందానికి ఇద్దరు తుపాకులు ధరించిన బాడీగార్డులను చూసి జనం తెగనవ్వుకున్నారు. ఈయనకెందుకా అని. అది సినిమా కాబట్టి ఏదో సరదా సీన్. కానీ అంతకంటే విచిత్రమేమంటే తోపుడు బండి వ్యాపారికి కోర్టు గన్‌మెన్‌లను ఏర్పాటుచేయడం. ఇది వాస్తవం.
అసలు తోపుడు బండివాడికి అంత సీన్ ఎందుకా అని ఇప్పటికే తెగ ఆలోచిస్తున్నారుగదా. అతగాడికి కాదు ఆయన ఊళ్లో భూమి తగాదా ఆయనకు గన్‌మెన్‌లతోటే తిరగాల్సిన పరిస్థితి కల్పించింది. ఆయన పేరు రామేశ్వర్ దయాళ్. ఉత్తరప్రదేశ్ ఎటా జిల్లా నివాసి. ఆయన తోపుడు బండి మీద దుస్తు లు అమ్ము తూంటాడు. అలా రోజంతా ఊళ్లో తిరుగుతూ రోజుకు 200 నుంచి 300 రూపాయలు సంపాదిస్తాడు. ఇటీవల రామేశ్వర్ అక్కడి ఎస్పీ నేత మాజీ ఎమ్మెల్యే రామేశ్వర్ సింగ్ సోదరుడు జుగేంద్ర సింగ్‌ను కలిశాడు. తన భూమికి పట్టా ఇప్పించాలని కోరాడు.
వాస్తవానికి భూమికి పట్టా ఇప్పించడం అనేది మాజీ ఎమ్మెల్యే తమ్ముడికి పెద్ద లెక్కేమీ కాదు. కానీ భూమిని కాజేద్దామని ఆలోచన వచ్చే ఉంటుంది. అందుకే ఏదో ఒక గొడవపెట్టుకోవాలనుకున్నాడు. రామేశ్వర్‌ను కులం పేరుతో తిట్టాడు. అంతే కులం మాట ఎత్తగానే వారి మధ్య చిన్నగొడవ చిలికి చిలికి గాలివానై ఏకంగా కనపడితే చంపుతానని బెదిరించేదాకా పోయింది. భయంతో రామేశ్వర్ దయాళ్ పరుగున పోలీసు స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. కానీ జుగేంద్ర అక్కడితో ఆగక అసలా భూమి నాదే అంటూ హైకోర్టును ఆశ్ర యించాడు. రామేశ్వర్‌ను కోర్టువారు రమ్మన్నారు. అతను ఒక్కడే భయం భయంగా వెళ్లాడు. అతనితో ఎవ్వరూ లేకపోవడం సంగతి విని కోర్టు అతనికి వెంటనే భద్రత కల్పించ మని పోలీసులను ఆదేశిం చింది.
కోర్టు ఆదేశాన్ని శిరసావహించి పోలీసులు రామేశ్వర్‌కు ఇద్దరు బాడీగార్డులను నియమించారు. అంతే కాదు వారిద్దరికి ఏకే 47 రైఫిళ్లనూ ఇచ్చారు. రామేశ్వర్ ఇపుడు తోపుడు బండి మీద దుస్తులు అమ్ముతూ రాజకీయనాయకుడిలా నిటారుగా తిరుగుతున్నాడు. మరి ఏకే 47 తో వున్నవారిని వెంటేసుకుని తిరగడం అంత ధైర్యాన్నిస్తుంది కదా!






