Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఒక్కసారిగా కూలిన బ్రిడ్జి.. నదిలో పడిన వాహనాలు
posted on: Jul 9, 2025 9:07PM
.webp)
గుజరాత్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. గుజరాత్ వడోదరాలోని మహిసాగన్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జి ఒక్కసారిగా కూలింది. ఆ సమయంలో బ్రిడ్జిపై ప్రయాణాలు సాగిస్తున్న రెండు లారీలతో పాటు పలు వాహనాలు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
దాదాపు 10 మందిని రక్షించారు. చిక్కుకుపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఈ వంతెన 45 ఏళ్ల కిందట నిర్మించిందిగా అధికారులు తెలిపారు. చాలా కాలంగా ఇది శిథిలావస్థలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు అధికారులు వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. ఇతర మార్గాల ద్వారా వాహనాలను మళ్లిస్తున్నారు.






