జీఎస్టీ బిల్లుకు ఆమోదం.. ధరలు పెరిగేవి..తగ్గేవి..

 

కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జీఎస్టీ బిల్లుకు లోక్ సభలో ఆమోదం లభించింది. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ... ఏకీకృత పన్ను విధానంలో భాగంగా వ్యాపారులపై వేధింపులు ఉండవని తెలిపారు. ఇంకా ఈ బిల్లు అమలులోకి వస్తే వేటి ధరలు పెరుగుతాయో, తగ్గుతాయో.. పన్ను శాతాలు ఎలా ఉంటాయో చూద్దాం..

 

ధరల పెరుగుదల..

 

కార్లు, సిగరెట్, బీడీలు, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులు, బ్రాండెడ్ శీతల పానీయాల ధరలు పెరుతాయి.

 

ధరల తగ్గుదల...

 

జీఎస్టీ అమలుతో షాంపులు, చాక్లెట్లు, బ్రెడ్, బ్యాటరీలు, టాయిలెట్ ప్రొడక్టులు, రెస్టారెంట్ భోజనాలు, చిన్న కార్లు, డైరెక్ట్ టు హోం డిష్ సెట్లు, ఎఫ్ఎంసీజీ వస్తువుల ధరలు తగ్గుతాయి.

 

ఇంకా పన్ను రేట్లను పరిశీలిస్తే, వంట నూనెలు, మసాలా దినుసులు, టీ, కాఫీ తదితరాలపై 5 శాతం, కంప్యూటర్లు, ప్రాసెస్డ్ ఆహార పదార్థాలపై 12 శాతం, సబ్బులు, నూనెలు, షేవింగ్ సామానులు తదితరాలపై 18 శాతం, విలాస వస్తువులు, పొగాకు ఉత్పత్తులపై 28 శాతం పన్ను ఉంటుంది. ఆహార ధాన్యాలు, కూరగాయలు, గుడ్లు, పండ్లు, చికెన్ వంటి ఉత్పత్తులపై పన్నులు ఉండవు.