తొలి సైనిక ఉపగ్రహ ప్రయోగం సక్సెస్‌

 

భారతీయ తొలి సైనిక ఉపగ్రహం GSAT-7 శుక్రవారం ఉదయం విజయవంతంగా ప్రయోగించారు. యూరొపియన్‌ స్పేస్‌ ఏజెన్సీకి చెందిన భారీ రాకెట్‌ ద్వారా ఈ ఉపగ్రహాన్నినిర్ణీత కక్షలో ప్రవేశ పెట్టారు. ఫసిఫిక్‌ కోస్ట్‌లోని ఫ్రెంచ్‌గయానాలోని కౌరవ్‌ అంతరిక్ష కేంద్రం నుండి ఈ ప్రయోగం జరిగింది.

ఎరియన్‌ 5 రాకెట్‌ ద్వారా ప్రయోగించిన ఈ ఉపగ్రహం భూమికి 3600 కిలీమీటరల్ దూరం నుంచి తన తన పనిని చేయనుంది. ఈ ప్రయోగానికి దాదాపు 470 కోట్లు ఖర్చయినట్టుగా ప్రకటించారు.

యుధ్ద నౌకల సమాచారం కమ్యూనికేషన్‌తో పాటు, రక్షణ చర్యలకు కావాల్సిన ఎన్నో వివరాలను తెలుసుకోవడానికి ఈ ఉపగ్రహం సహాయపడనుంది. ఇప్పటికే ఈ ఉపగ్రహానికి సంభందించిన అన్ని టెస్ట్‌లు నిర్వహించిన శాస్త్ర వేత్తలు శనివారం నుంచి ఉపగ్రహం తన పని మొదలుపెడుతుందన్నారు. గ్రహణ సమయంలో కూడా పని చేయటం ఈ ఉపగ్రహం ప్రత్యేకత.