Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పెళ్లికి ముందు రోజు.. వరుడు ఉరి..
posted on: Jun 4, 2021 10:42AM
ఈ ప్రపంచంలో అన్నింటికంటే మానవ జన్మ పవిత్రమైనది. దేవుడు ఇచ్చిన ఆ జీవితాన్ని అనుభవించకుండా చాలా మంది చనిపోతున్నారు. చనిపోవడం అనే మాట పక్కన పెడితే ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా పెళ్లి ఏర్పాట్లు ఒక వైపు, వరుడి చాడు మరో వైపు. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏందో చూద్దాం. బంధువులు కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లు సందడిగా జరుగుతున్నాయి. బంధువులు, స్నేహితులు ఉత్సాహంగా అటు ఇటు హడావిడిగా తిరుగుతున్నారు. అదే సమయంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. తెల్లవారితే పెళ్లిపీటలెక్కాల్సిన వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
అది రంగారెడ్డి జిల్లా. తలకొండపల్లి మండలం. మెదక్‌పల్లి. ఈ గ్రామానికి చెందిన పట్టెబర్ల యాదమ్మ, లింగయ్యల చిన్న కుమారుడు శ్రీకాంత్ గౌడ్. అతని వయసు 25 ఏళ్ళు. శ్రీకాంత్ కు కందుకూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయితో 4వ తేదీన వివాహం చేయడానికి ముహూర్తం నిశ్చయించారు. కుటుంబ సభ్యులు అంత పెళ్లి పనుల్లో మునిగారు. పెళ్లి బజంత్రీలు వినిపించాల్సిన ఆ ఇంట్లో సావు సప్పుడు వినిపించాయి. నవ్వులు పుయ్యాల్సిన ఆ ఇంట్లో ఏడుపులు వినిపించాయి. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం..
కొత్తగా నిర్మించిన ఇంటి వద్ద కుటుంబసభ్యులు, బంధువులు గురువారం తెల్లవారుజామున పందిరి వేసే పనుల్లో ఉన్నారు. పాత నివాసంలో నిద్రిస్తున్న శ్రీకాంత్‌గౌడ్ దగ్గరికి అతని అన్న రాజు వెళ్లి పందిరి కొమ్మలు తీసుకురావడానికి వెళ్తున్నామని చెప్పాడు. రాజు తిరిగి వచ్చే సరికి ఇంట్లో శ్రీకాంత్ ఉరేసుకుని ఉండటంతో తల్లిదండ్రులతో పాటు బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే శ్రీకాంత్ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.


.jpg)



