700 మంది పడవ బోల్తా..


గ్రీస్‌లోని క్రెటే ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 700 మందితో వెళ్తున్న పడవ బోల్తా పడింది. దీనిపై సమాచారం అందుకున్న భద్రతాదళాలు సత్వరమే స్పందించినప్పటికీ కేవలం 250 మందిని మాత్రమే రక్షించగలిగామని, వందలాది మంది గల్లంతయ్యారని వారు చెప్పారు. ముగ్గురు ప్రయాణికులు మరణించినట్టు తెలిపారు. ఇంకా సహాయకచర్యలు కొనసాగుతున్నాయని వారు తెలిపారు. బాధితులను రక్షించేందుకు గ్రీస్‌ ప్రభుత్వం క్రెటే అంతర్జాతీయ జలాల్లోకి రెండు పడవలు, నాలుగు ఓడలు, రెండు హెలికాప్టర్లను పంపించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu