Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గుడ్డుపై గవర్నర్ ఆగ్రహం.. ఒక్క గుడ్డేనా
posted on: Aug 24, 2015 1:04PM

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్.. తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ కలిసి గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిలో భాగంగానే మహబూబ్ నగర్ జిల్లా కిషన్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో పరిశీలించారు. ఈ సందర్భంగా గవర్నర్ అక్కడి విద్యార్ధులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అయితే కళాశాల సిబ్బంది విద్యార్ధులకు వారానికి ఒక గుడ్డు మాత్రమే పెడుతున్నారని తెలుసుకొని ఆగ్రహం వ్యక్త చేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందో తెలసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అంతేకాదు ఏఏ పాఠశాలలు విద్యార్ధులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నాయో ఆ పాఠశాలలకు సబ్సిడీ గ్యాస్ అందేలా చూడాలని ఆదేశించారు. అనంతరం కిషన్ నగర్ ప్రజలతో ఆయన ముఖాముఖి నిర్వహించిన గ్రామంలోని సమస్యలపై ఆరా తీశారు.






