Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఖైరతాబాద్ గణపతికి గవర్నర్ పూజలు
posted on: Aug 29, 2014 2:09PM
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ప్రతి యేటా ప్రతిష్ఠించే భారీ గణపతికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ మొదటి పూజ శుక్రవారం ఉదయం నిర్వహించారు. గవర్నర్ దంపతులు వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఖైరతాబాద్ వినాయకుడికి 5 వేల కిలోల లడ్డూ ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. ఈ లడ్డును తూర్పు గోదావరి జిల్లాకు చెందిన భక్తుడు తయారుచేయడం విశేషం. విశాఖపట్టణంలో 71 అడుగుల భారీ గణపతిని ప్రతిష్ఠించి పూజలు జరుపుతున్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమిద్ అన్సారీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.


.jpg)



