Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జారిపడిన సీనియర్ జార్జి బుష్
posted on: Jul 16, 2015 2:25PM

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెర్బర్ట్ వాకర్ బుష్ (సీనియర్ బుష్) (91) బుధవారం నాడు తన నివాసంలో ప్రమాదవశాత్తూ జారి పడిపోయారు. దాంతో ఆయన మెడ దగ్గర ఎముక విరిగింది. ప్రస్తుతం ఆయన పోర్ట్‌లాండ్ మెయిన్ మెడికల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందని అధికార ప్రతినిధి తెలిపారు. జార్జ్ హెచ్.డబ్ల్యు. బుష్ అమెరికా దేశానికి 41వ అధ్యక్షుడు. 1989 - 1993 సంవత్సరాల మధ్య అమెరికా అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించారు. ఈయన కుమారుడు జార్జ్ డబ్ల్యు బుష్ కూడా అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన విషయం తెలిసిందే.






