Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...డ్రైవర్ లేకుండా పరుగులు తీసిన గూడ్స్ రైలు
posted on: Feb 26, 2024 11:41AM
లోకో పైలట్ లేకుండా ఓ గూడ్స్ రైలు 78 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి కలకలం సృష్టించింది. జమ్ముకశ్మీర్‌లోని కథువా స్టేషన్‌లో 53 వ్యాగన్ల చిప్ స్టోన్స్ లోడుతో జమ్ముకశ్మీర్ నుంచి పంజాబ్ బయలుదేరిన గూడ్స్ రైలు జమ్ములోని కథువా రైల్వేస్టేషన్లో ఆగింది.
అయితే లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ హ్యాండ్ బ్రేక్ వేయకుండానే బయటకు వెళ్లిపోగా పఠాన్ కోట్ వైపు రైల్వే ట్రాక్ వాలుగా ఉండటం వల్ల రైలు ముందుకు కదిలి గంటకు 100 కిలో మీటర్ల వేగం అందుకుని 84 కిలోమీటర్లు ప్రయాణించింది.చివరికి ఉచ్చి బస్సీ రైల్వే స్టేషన్ వద్ద చెక్క దిమ్మెలు అడ్డుపెట్టి అపాల్సి వచ్చింది.ఈ రైలు ప్రయాణిస్తున్న సమయంలో ట్రాక్ పై ఎదురుగా రైళ్లు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఇంతకుముందు కూడా ఇలాంటి ఘటనే జరిగింది. 2020లో జార్ఖండ్‌లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. బర్సువా రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలు నిలబడి ఉంది. ఈ సమయంలో రైలు ఒక్కసారిగా బోల్తా పడింది. దీని తరువాత, రైలు బిమల్‌ఘర్ రైల్వే స్టేషన్ వైపు వెనుకకు కదలడం ప్రారంభించింది. గంటకు 100 కి.మీ వేగంతో పరుగెత్తడం ప్రారంభించింది.


.webp)
.webp)


