Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వైసీపీకి మాజీ మంత్రి శమంతక మణి గుడ్ బై
posted on: Apr 8, 2024 5:19PM
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అభిప్రాయం ప్రకారం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎపిలో వై ఎస్ఆర్ సిపి పరాజయం తప్పదని వెల్లడించడంతో నేతలు కప్పదాటు చర్యలకు పాల్పడుతున్నారు. వైఎస్ ఆర్ సిపి నేతలు కొందరు ఉన్న ఫలంగా రాజీనామాలకు ఎగబడ్డారు.
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో వైసీపీకి మరో షాక్ తగిలింది. అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శమంతకమణి పార్టీకి రాజీనామా చేశారు. ఆమె కొడుకు అశోక్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇటీవలే ఆమె కూతురు, మాజీ ఎమ్మెల్యే యామినీబాల వైసీపీని వీడారు.
శమంతకమణి కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1980లో అనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 1989-91 మధ్య కాలంలో మంత్రిగా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో శమంతకమణి కూతురు యామినీబాలకు శింగనమల నియోజకవర్గం నుంచి చంద్రబాబు అవకాశం ఇచ్చారు. ఆ ఎన్నికల్లో యామినీబాల గెలుపొందారు. అయితే, 2019లో టీడీపీ టికెట్ దక్కకపోవడంతో శమంతకమణి, యామినీబాల, అశోక్ వైసీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డ వీరు... వైసీపీకి గుడ్ బై చెప్పారు.


.webp)
.webp)


