మలమల మాడుతున్న గోదావరి
Published on: Thu Mar 22, 2012 11:02AM
ఒకప్పుడు గలగలా పారిన గోదావరి ఇప్పుడు నీరులేక మలమల మాడుతోంది. రాజమండ్రి సమీపాన నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోవడంతో గోదావరి నది ఎడారిగా దర్శనమిస్తోంది. ఇటువంటి పరిస్థితి గతంలో తాము ఎప్ప్పుడూ చూడలేదని స్థానికులు అంటున్నారు. రాజమండ్రి పుష్కరాల రేవులో నీళ్ళు దాదాపు అడుగంటిపోయాయి. నీటి ప్రవాహం లేకపోవడంతో అడుగంటిపోయిన నీళ్ళు కలుషితంగా మారాయి. నీటి మట్టాలు అడుగంటడంతో పాపికొండల విహార యాత్రకు బ్రేక్ పడింది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడం, పైనుంచి నీరు విడుదల కాకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడిందని స్థానికులు అంటున్నారు. కొద్ది రోజుల్లో గోదావరిలోకి నీరు రాకపోతే రాజమండ్రికి మంచినీటి ఎద్దడి ఎదురయ్యే ప్రమాదం కూడా ఉంది. ఎప్పుడూ నీటి ప్రవాహంతో కళకళలాడే గోదావరి ఇప్పుడు ఎడారిలా మారడం పట్ల స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


