బాయ్‌ఫ్రెండ్స్‌ని నమ్మొద్దు అమ్మాయిలూ...

 

అమ్మాయిలకి తమ బాయ్ ఫ్రెండ్స్ అంటే చాలా నమ్మకం. కానీ ఆ నమ్మకం చాలా దారుణంగా వమ్ము అవుతోందని తాజాగా విడుదలైన గణాంకాలు తెలియజేస్తున్నాయి. ముంబై నగరంలో బాయ్ ఫ్రెండ్స్ చేతిలో అత్యాచారానికి గురౌతున్న అమ్మాయిల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోందని ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా లెక్కలతో సహా చెప్పారు. ఈ సంవత్సరం జనవరి నుంచి అక్టోబర్ వరకు ముంబై నగరంలో జరిగిన అత్యాచార సంఘటనలను పరిశీలిస్తే అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్స్‌ని గుడ్డిగా నమ్మడం ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది. ముంబై నగరంలో ఈ సంవత్సరం ఇప్పటి వరకు 542 రేప్ ఘటనలు జరిగాయి. వాటిలో 389 కేసులు బాయ్ఫ్రెండ్ ద్వారా యువతులు మానభంగానికి గురయినవే వుంటడం దారుణం. అమ్మాయిలు బాయ్‌ఫ్రెండ్స్ చెప్పే తియ్యటి కబుర్లను గుడ్డిగా నమ్మడం వల్లే అత్యాచారాలు పెరిగిపోతున్నాయని పోలీస్ కమిషనర్ వివరించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu